పశ్చిమాసియా టూర్​కు ట్రంప్​..4 రోజులపాటు పర్యటించనున్న అమెరికా ప్రెసిడెంట్​

పశ్చిమాసియా టూర్​కు ట్రంప్​..4 రోజులపాటు పర్యటించనున్న అమెరికా ప్రెసిడెంట్​
  • రియాద్ ఎయిర్​పోర్ట్​​లో ఘన స్వాగతం పలికిన సౌదీ క్రౌన్​ప్రిన్స్​ బిన్​సల్మాన్​
  • చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంపై చర్చించే చాన్స్​

రియాద్: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ పశ్చిమాసియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఎయిర్​ఫోర్స్​వన్​ విమానాశ్రయంనుంచి బయలుదేరిన ఆయన సౌదీ అరేబియాకు చేరుకున్నారు. రియాద్​ ఎయిర్​పోర్ట్​లో ట్రంప్​కు సౌదీ క్రౌన్​ప్రిన్స్ మహ్మద్​ బిన్​సల్మాన్ ఘన స్వాగతం పలికారు. ​ట్రంప్‌‌‌‌ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి​ పీట్‌‌‌‌ హెగ్సెత్‌‌‌‌, వాణిజ్య మంత్రి హోవర్డ్‌‌‌‌ లుట్నిక్‌‌‌‌, ఇంధనశాఖ మంత్రి క్రిస్‌‌‌‌ రైట్‌‌‌‌ ఉన్నారు. ట్రంప్‌‌‌‌ రెండోసారి అమెరికా అధికారపగ్గాలు చేపట్టాక తొలి పెద్ద పర్యటన ఇదే. ఇందులో భాగంగా ఆయన నాలుగు రోజుల్లో సౌదీ, యూఏఈ, ఖతార్‌‌‌‌ను సందర్శించనున్నారు. ట్రంప్​కు క్రౌన్​ప్రిన్స్​ బిన్​సల్మాన్​ అధికారిక విందు ఏర్పాటు చేశారు. 

ఇందులో అమెజాన్‌‌‌‌, ఎన్విడియా, ఓపెన్‌‌‌‌ ఏఐ, ఉబెర్‌‌‌‌, కోకాకోలా, గూగుల్‌‌‌‌, బోయింగ్‌‌‌‌ సీఈవోలు   పాల్గొననున్నారు.  ఈ విందుకు ప్రపంచ కుబేరుడు,  టెస్లా సారథి ఎలాన్​ మస్క్‌‌‌‌ కూడా హాజరుకానున్నారు. అలాగే,  రియాద్ నుంచి బయలుదేరే ముందు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌‌తో కూడిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో పాల్గొంటారు. చమురు ధరల తగ్గింపుపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలోనే పుతిన్, జెలెన్​స్కీతో చర్చలు జరిపి ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్​ అడుగులు వేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే తాను  తుర్కియేకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ట్రంప్‌‌‌‌ స్వయంగా వెల్లడించారు. 

గిఫ్ట్​ వద్దనడానికి నేను మూర్ఖుడిని కాదు

ట్రంప్​కు ఖతార్​ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్​737 విమానాన్ని గిఫ్ట్​గా ఇవ్వాలని నిర్ణయించిందని, దీని  విలువ 400 మిలియన్​ డాలర్లు ఉంటుందనే ప్రచారం మొదలైంది. దీనిపై అమెరికాలో విమర్శలు మొదలయ్యాయి. ఆ గిఫ్ట్​ తీసుకోవడం అనైతికం అంటూ ట్రంప్​ సొంత పార్టీలోనే కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, ఆ విమర్శలను ట్రంప్​ తోసిపుచ్చారు. అంత ఖరీదైన గిఫ్ట్​ వద్దనడానికి తానేమన్నా మూర్ఖుడినా అని వ్యాఖ్యానించారు. చివర్లో దీనిని ప్రెసిడెన్షియల్‌‌‌‌ లైబ్రరీకి ఇచ్చేస్తానని, వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.  దీనిని ఎయిర్​ఫోర్స్​వన్​కు  వాడుకోనున్నట్టు ట్రంప్​ సన్నిహితులు వెల్లడించారు. అయితే, తాము విమానం ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదని,  తాత్కాలికంగా ఓ విమానాన్ని బదిలీ చేసే అంశం మాత్రమే చర్చల్లో ఉందని ఖతార్​ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం.