ఈనెల వచ్చే వారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉండి ప్రార్ధనలు నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మత పెద్ద గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజీజ్ అల్ షేక్ సూచించారు. రంజాన్ పర్వదినంలో మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. దీంతో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా ప్రార్ధనల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని… ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి ప్రార్ధనలు చేసుకోవాలని సూచించింది.

