వరల్డ్ కప్ షూటింగ్ : భారత్ కు మరో గోల్డ్

వరల్డ్ కప్ షూటింగ్ : భారత్ కు మరో గోల్డ్

న్యూఢిల్లి : ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇవాళ మనకు మరో స్వర్ణం వచ్చింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురి తప్పని సౌరభ్ చోదరి.. భారత్ కు మరో గోల్డ్ అందించాడు. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో సరికొత్త రికార్డుతో అపూర్వి గోల్డ్ మెడల్ గెలుచుకోవడం విశేషం.

ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు.  ఫలితంగా వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌ గా అపూర్వి నిలిచారు. అంతకముందు అంజలీ భగవత్‌ ఈ ఫీట్‌ సాధించారు.