విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి సౌరాష్ట్ర

విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి సౌరాష్ట్ర

బెంగళూరు: కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్విక్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ (100 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో చెలరేగడంతో.. విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర సెమీస్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టింది. ప్రేరక్‌‌‌‌‌‌‌‌ మన్కడ్‌‌‌‌‌‌‌‌ (67), చిరాగ్‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌ (40 నాటౌట్‌‌‌‌‌‌‌‌) బ్యాట్లు ఝుళిపించడంతో.. సోమవారం జరిగిన రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లో సౌరాష్ట్ర 17 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో (వీజేడీ పద్ధతి) ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన యూపీ 50 ఓవర్లలో 310/8 స్కోరు చేసింది.

 అభిషేక్‌‌‌‌‌‌‌‌ గోస్వామి (88), సమీర్‌‌‌‌‌‌‌‌ రిజ్వి (88), ప్రియమ్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌ (35), ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ వీర్‌‌‌‌‌‌‌‌ (30) రాణించారు. చేతన్‌‌‌‌‌‌‌‌ సకారియా 3, అంకూర్‌‌‌‌‌‌‌‌ పన్వర్‌‌‌‌‌‌‌‌, ప్రేరక్‌‌‌‌‌‌‌‌ మన్కడ్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 238/3 స్కోరు చేసింది. ఈ దశలో వర్షం వల్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అంతరాయం కలిగింది. అప్పటికే వీజేడీ పద్ధతిలో సౌరాష్ట్ర ఎక్కువ స్కోరు చేసి ఉండటంతో విజేతగా ప్రటించారు. విశ్వరాజ్‌‌‌‌‌‌‌‌ జడేజా (9) విఫలమైనా.. హర్విక్‌‌‌‌‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. ప్రేరక్‌‌‌‌‌‌‌‌తో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 133, సమ్మర్‌‌‌‌‌‌‌‌ గజ్జర్‌‌‌‌‌‌‌‌ (14)తో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 15, చిరాగ్‌‌‌‌‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 76 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. కరణ్‌‌‌‌‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌‌‌‌‌, విప్రజ్‌‌‌‌‌‌‌‌ తలా ఓ వికెట్ తీశారు. ప్రేరక్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.