వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సాయం చేసిండు : రాహుల్ గాంధీ

వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సాయం చేసిండు : రాహుల్ గాంధీ

వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులను ఆయన మోసం చేశారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన ఓ లేఖను రాహుల్ మీడియాకు చూపించారు. ఎన్నో ఏళ్లు  జైలులో ఉన్నా.. నెహ్రూ, గాంధీ, పటేల్ ఎవ్వరూ బ్రిటీష్ వారికి ఈ విధంగా లేఖ రాయలేదన్నారు. 

‘‘సావర్కర్ బ్రిటీష్ వారికి రాసిన లేఖలో సార్, నేను మీకు అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటానని వేడుకుంటున్నట్లు స్పష్టంగా ఉంది. దానిపై సావర్కర్ సంతకం కూడా ఉంది. సావర్కర్ బ్రిటిష్ వారికి సహాయం చేశారు. ఆ లేఖలో సావర్కర్ చేసిన వ్యాఖ్యలు భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రధానంగా అప్పట్లో బ్రిటీష్ వారితో పోరాడుతున్న  గాంధీ,  నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులకు ద్రోహం చేసేలా  ఉన్నాయి’’ అని రాహుల్ పేర్కొన్నారు.  

రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన సహా బీజేపీ దాని అనుబంధ సంఘాలు మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై దాదర్ శివాజీ పార్క్ పీఎస్ లో వీర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ కంప్లైంట్ చేశారు.  వీర్ సావర్కర్ పై రాహుల్ తప్పుగా మాట్లాడారని.. ఫ్రీడమ్ ఫైటర్ ను అవమానించారని మండిపడ్డారు.