
ఇల్లు రాసివ్వాలని గొడవపడుతూ చంపేందుకు తన కొడుకు యత్నించాడని గాం ధీ కుటీర్ లో ఉండే లక్ష్మి (70) నారాయణగూడ పోలీసులను శనివారం ఆశ్రయిం చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘తనకున్న ఆస్తిని కొడు కు రాజశేఖర్ కు, కూతురు కౌసల్యకు పంచి అక్కడే మరో ఇంట్లో లక్ష్మి ఉంటోం ది. తాగుడుకు బానిసైన కొడుకు తల్లి ఉండే ఇంటిని కూడా తనకే ఇవ్వాలని గొడవపడుతున్నాడు . మూడ్రోజుల క్రితం ఇంటి నుండి గెంటేయడంతో కూతురు ఇంట్లో తలదాచుకుంటోంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం తెలిసి రాజశేఖర్ కత్తితో దాడి చెయ్యడానికి వెళ్లాడు . అతని సోదరి కౌసల్య ఎదురుపడటంతో ఆమె కారణంగానే ఇదంతా జరిగిందని దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు చెప్పారు.