చెరువులో పడిన బాలుడిని కాపాడి.. యువకుడు గల్లంతు..

చెరువులో పడిన బాలుడిని కాపాడి.. యువకుడు గల్లంతు..

హైదరాబాద్ హకీంపేటలో దారుణం జరిగింది. చెరువులో పడిపోయిన బాలుడిని కాపాడబోయి యువకుడు మిస్ కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే హకీంపేట చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఫిల్మ్ నగర్ కు చెందిన పవన్ రాజ్ ఆదివారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి హకీంపేట చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో ఓ బాలుడు  చెరువులో పడిపోయాడు. 

అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు పవన్ రాజ్. బాలుడి రక్షించిన తర్వాత పవన్ రాజ్ చెరువులో కనిపించకుండా పోయాడు. పవన్ రాజు కోసం నిన్నటి నుంచి NDRF బృందాలు చెరువులో గాలిస్తున్నాయి. ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ | కుక్కలు బాబోయ్‌‌‌‌.. గ్రేటర్, శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద