ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో 6 వేల 160 అప్రెంటిస్ ఖాళీలు

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో 6 వేల 160 అప్రెంటిస్ ఖాళీలు

స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, కార్పొరేట్ సెంటర్ అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. దీంతో 6,160 అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీల నియామకాలకు దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్: 6,160 ఖాళీలు (ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 603, యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 2665). ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలో 390 ఖాళీలు, తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది ట్రైనింగ్​ ఇస్తారు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నెలకు రూ.15,000 స్టైఫండ్​ చెల్లిస్తారు.

సెలెక్షన్​: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  జనరల్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పరీక్షలు అక్టోబర్/ నవంబర్ లో నిర్వహించనున్నారు. వివరాలకు  www.sbi.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.