SBI బ్యాంకు జాబ్స్: శాలరీ 15 వేలు.. క్వాలిఫికేషన్ డిగ్రీ.. జూన్ 8 లాస్ట్ డేట్ !

SBI బ్యాంకు జాబ్స్: శాలరీ 15 వేలు.. క్వాలిఫికేషన్ డిగ్రీ.. జూన్ 8 లాస్ట్ డేట్ !

SBI వేల అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ చదివి ఉద్యోగాల వేటలో ఉన్న అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 7 వేల150 అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 19, మంగళవారం ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 8. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు SBI అధికారిక పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు.

స్థానిక భాషలో పరీక్ష తప్పనిసరి:
SBI ప్రకటన ప్రకారం.. ఆన్‌లైన్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన స్థానిక భాషలో నైపుణ్య పరీక్షకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు నిర్దేశించిన స్థానిక భాషను చదవడం, వ్రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. 

స్థానిక భాషకు సంబంధించిన పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణించబోమని SBI బ్యాంకు స్పష్టం చేసింది.

క్వాలిఫికేషన్:
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. సింపుల్గా  చెప్పాలంటే ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మినిమమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ.

వయో పరిమితి:
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపునకు అర్హులు.

దరఖాస్తు రుసుము:
* జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ. 300
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు

ఎంపిక ప్రక్రియ మరియు పరీక్షా విధానం:
నియామక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో SBI అప్రెంటిస్ పోస్టుల ఖాళీలు:
* తెలంగాణ: 491 పోస్టులు
* తెలంగాణలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
* ఆంధ్రప్రదేశ్: 709 పోస్టులు
* ఏపీ పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు

అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా కావాల్సినవి:
* పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
* సిగ్నేచర్ కాపీ
*  గ్రాడ్యుయేషన్ డాక్యమెంట్స్
* ఐడెంటిటీ ప్రూఫ్