ఎస్‌‌బీఐ లోన్లపై పెరిగిన వడ్డీ

ఎస్‌‌బీఐ లోన్లపై పెరిగిన వడ్డీ
  • ఎస్‌‌బీఐ లోన్లపై పెరిగిన వడ్డీ
  • ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచిన బ్యాంక్‌‌

న్యూఢిల్లీ :  లోన్లపై వడ్డీని స్టేట్‌‌ బ్యాంక్ (ఎస్‌‌బీఐ)  పెంచింది.  మార్జినల్‌‌ కాస్ట్‌‌ ఆఫ్‌‌ ఫండ్‌‌ బేస్డ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌) 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు పెంచింది. మారిన రేట్లు శుక్రవారం నుంచే  అమల్లోకి వచ్చాయి. కొన్ని పరిస్థితుల్లో తప్ప ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ కంటే తక్కువకు బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు. ఖర్చులు, ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకొని ఈ  రేటును నిర్ణయిస్తారు. నెల రోజులు, మూడు నెలల  ఎంసీఎల్ఆర్‌‌‌‌ను ప్రస్తుతం ఉన్న 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 8.45 శాతం నుంచి  8.55 శాతానికి బ్యాంక్ పెంచింది.  ఏడాది టైమ్ పీరియడ్‌‌ గల ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పొడిగించింది. 

రెండేళ్ల ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ 8.65 శాతం నుంచి 8.75 శాతానికి, మూడేళ్లది 8.75  శాతం నుంచి 8.85 శాతానికి పెంచింది. ఎంసీఎల్‌‌ఆర్ పెరగడం వలన హోమ్‌‌, వెహికల్‌‌, పర్సనల్ లోన్లపై వడ్డీ పెరుగుతుంది. బారోవర్లపై ఈఎంఐ భారం పెరుగుతుంది. ఫిక్స్డ్ రేటు ఉన్న హోమ్‌‌ లోన్లపై ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ ప్రభావం ఉండదు. ఆర్‌‌‌‌బీఐ రూల్ ప్రకారం, బ్యాంక్‌‌లు వివిధ టైమ్ పీరియడ్‌‌లకు చెందిన ఎంసీఎల్‌‌ఆర్‌‌‌‌ను తమ వెబ్‌‌సైట్లలో పబ్లిష్ చేయాలి. ఫ్లోటింగ్ రేట్‌‌ హోమ్ లోన్లపై వడ్డీ మార్చాలంటే నెక్స్ట్‌‌ రీసెట్ డేట్‌‌ వరకు వెయిట్ చేయాలి.