
హైదరాబాద్, వెలుగు : కొవిడ్‌పై మెరుగైన పరిశోధనలను స్పీడ్‌గా నిర్వహించేందుకు సీసీఎంబీకి ఎస్బీఐ ఆర్థిక సాయం అందించింది. ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా రూ. 9.94 కోట్ల చెక్కును సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కుమార్ కు ఇచ్చారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జీనోమ్ గైడెడ్ పాండమిక్ ప్రివెన్షన్ బలోపేతానికి సీఎస్ఆర్ నిధులతో ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంజూరు చేసినట్లు తెలిపారు. కరోనా నియంత్రణపై ఆధునిక విధానాల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్బీఐ డీఎండీ ఓపీ మిశ్రా, డీఎండీ విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజుల కళ్యాణ సుందరం, ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.