
ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డాటా ట్రాన్స్ లేటర్, మేనేజర్ విభాగాల్లో మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి మే 16 నుంచి అప్లై చేసుకోవాలి. జూన్ 2 చివరి తేది. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ఎస్సీ, ఎస్టీ మరియు వికలాంగులైన అభ్యర్థులు రూ.125, జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 750 ఫీజు చెల్లించాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూల ద్వారా జాబ్ ఇస్తారు.