ఎన్ఐఎం టార్గెట్ను చేరుకుంటాం.. ఎస్బీఐ చైర్మన్ శెట్టి

ఎన్ఐఎం టార్గెట్ను చేరుకుంటాం.. ఎస్బీఐ చైర్మన్  శెట్టి

న్యూఢిల్లీ:  ఆర్​బీఐ  వచ్చే వారం మానిటరీ పాలసీ మీటింగ్ (ఎంపీసీ)లో రెపో రేటును 0.25 శాతం తగ్గించినప్పటికీ, మూడు శాతం నికర  వడ్డీ మార్జిన్​ (ఎన్​ఐఎం) లక్ష్యాన్ని చేరుకుంటామని ఎస్​బీఐ చైర్మన్ ​శ్రీనివాసులు శెట్టి అన్నారు. 

తమ అంచనా ప్రకారం ఇది కేవలం స్వల్ప కోత మాత్రమే అవుతుందని, మార్జిన్లపై ఎక్కువ ప్రభావం ఉండబోదని తెలిపారు. సీఆర్​ఆర్​ ప్రయోజనం, ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్​ డిపాజిట్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీ) రీప్రైసింగ్​, పొదుపు  ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటివి ఎన్​ఐఎం టార్గెట్​ను చేరుకోవడానికి సాయపడతాయని అన్నారు. 

కేవలం 30 శాతం ఆస్తులు రెపో రేటుకు లింక్​అయి ఉన్నందున మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగా ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్​ క్వార్టర్​లో  ఎస్​బీఐ ఎన్​ఐఎం 2.93 శాతంగా నమోదైంది.