ఎస్ బీఐటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ కు ఆర్థికసాయం

ఎస్ బీఐటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ కు ఆర్థికసాయం

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం సిటీలోని ఎస్ బీఐటీ కాలేజ్ కు చెందిన స్టూడెంట్ ఇటీవల ప్రమాదంలో తన తండ్రిని కోల్పోయాడు. బాధితుడు, తమ కళాశాల విద్యార్థి ఈ. వీరభద్ర సుజిత్ కు శుక్రవారం ఆర్థికసాయం అందించినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శుక్రవారం తెలియజేశారు. విద్యార్థి సుజిత్ తండ్రి శంకర్ రావు మృతి చెందటంతో విద్యార్థి చదువులకు ఇబ్బంది కలగకుండా నేషనల్ ఇన్సురెన్స్ ద్వారా రూ.2 లక్షల చెక్కును అందజేశారు.  

విపత్తుల వల్లగానీ, ప్రమాదవశాత్తుగానీ, తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు తమ కళాశాల అండగా ఉండేలా ఈ పథకాన్ని ప్రారంభించినట్టు కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి తెలిపారు. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇవ్వడానికి ఇటువంటి ఆలోచన చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, డాక్టర్ జె. రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.