అమెజాన్ కు ఎంపికైన ఎస్ బీఐటీ స్టూడెంట్

అమెజాన్ కు ఎంపికైన ఎస్ బీఐటీ స్టూడెంట్

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అమెజాన్ కు తమ కళాశాల విద్యార్థిని షేక్ పర్వీన్ తబస్సుమ్ ఎంపికైనట్లు ఎస్ బీఐటీ కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శుక్రవారం తెలిపారు. లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కూడా ఉద్యోగం సాధించడం తమ కళాశాలకు గర్వకారణం అని తెలిపారు. కొలాబెరా డిజిటల్ సంస్థకు క్లైంట్​గా ఉన్న అమెజాన్​కు క్యాటలాగ్ స్పెషలిస్ట్​గా తమ విద్యార్థిని ఎంపికవడం గర్వించదగ్గ విషయమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి తెలిపారు. 

క్యాంపస్ రిక్రూట్​మెంట్ ట్రైనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ లాంటి వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ కంపెనీలకు తమ విద్యార్థులు ఎంపికవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రాజ్ కుమార్ తెలిపారు.  ఈ సందర్భంగా ఎంపికైన పర్వీన్ తబస్సుమ్ ను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డాక్టర్ ఏవీవీ శివ ప్రసాద్, డాక్టర్ జె. రవీంద్రబాబు, టీపీవోఎన్ సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.