దళితుల భూమి స్వాధీనం అన్యాయం ... హైడ్రాపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆగ్రహం

దళితుల భూమి స్వాధీనం అన్యాయం ...  హైడ్రాపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్  చైర్మన్ ఆగ్రహం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లి మండలం దయార్​గూడ పరిధిలో ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకున్న సర్వే నంబర్​155లోని భూమిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్​బక్కి వెంకటయ్య శనివారం పరిశీలించారు. స్థానిక దళిత కుటుంబాలతో మాట్లాడి భూమి వివరాలు తెలుసుకున్నారు. దళితులకు చెందిన భూమిని హైడ్రా అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైడ్రా, హెచ్ఎండీఏ అధికారులకు నోటీసులు పంపుతామన్నారు. భూ వివాదం కోర్టులో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్​వేయడం దారుణమని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దళితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.