ఆర్మీ హాస్పిటల్ లో రఘురామకృష్ణ రాజుకు వైద్యపరీక్షలు

ఆర్మీ హాస్పిటల్ లో రఘురామకృష్ణ రాజుకు వైద్యపరీక్షలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ లోని ఆర్మీఆస్పత్రిలో ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు చేస్తుంది. రఘురామకృష్ణ రాజు వైద్యపరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ అధికారిని నియమించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేస్తారు అధికారులు. మెడికల్ రీపోర్ట్స్ మొత్తం షీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు పంపించనున్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణ రాజును ఎవ్వరు కలవడానికి అనుమతి లేదు. చికిత్స కాలాన్ని మొత్తం జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని సుప్రీంకోర్టు అదేశించింది.