ధర్మపురి అర్వింద్ పై మూడు కేసులు

ధర్మపురి అర్వింద్ పై మూడు కేసులు

రాష్ట్రంలో బీజేపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మూడు కేసులు ఫైల్ అయ్యాయి. ఇందులో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది. కేసీఆర్ ను దూషించారని మూడు సెక్షన్ల పెట్టారు.  సీఎం కేసీఆర్ కార్టూన్ ని మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు ఫైల్ అయ్యింది. కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేసి.. సమాజంలో శాంతిభద్రతలు దెబ్బతీసేందుకు ప్రయత్నించారని బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదైంది. అలాగే మాదన్నపేట్ పీఎస్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల చంచల్ గూడ జైలు దగ్గర మీడియాతో మాట్లాడిన అర్వింద్.. ఎస్సీఎస్టీలను అవమానించేలా మాట్లాడారని పిటిషనర్ ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసులు చెప్పారు.