గ్రూప్ వన్ ప్రిలిమ్స్: స్క్యాన్డ్ OMR షీట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్న TGPSC

గ్రూప్ వన్ ప్రిలిమ్స్: స్క్యాన్డ్ OMR షీట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్న TGPSC

తెలంగాణాలో గ్రూప్ వన్ విషయంలో జరిగిన అవకతవకల గురించి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజి తర్వాత పరీక్ష మళ్ళీ నిర్వహించినప్పటికీ తర్వాత కూడా పలు చోట్ల బయోమెట్రిక్ నిర్వహించకపోవడంతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే, తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈసారి గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం.

ఈ క్రమంలో  గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది టీజీపీఎస్సి. అభ్యర్థుల స్క్యాన్డ్ OMR షీట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఈ నెల 24న సాయంత్రం 5గంటల నుండి అభ్యర్థుల OMR షీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది టీజీపీఎస్సి. టీజీపీఎస్సి నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రూప్ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని,అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.