ఇంజినీరింగ్ మేనేజ్​మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్

ఇంజినీరింగ్ మేనేజ్​మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో బీ కేటగిరీ (మేనేజ్ మెంట్) కోటా సీట్ల భర్తీకి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ షెడ్యూల్​ తో పాటు గైడ్​ లైన్స్ రిలీజ్ చేసింది. ఆగస్టు 1 నుంచి 9 వరకు కాలేజీలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని, దీన్నీ పత్రికల్లో ప్రకటనలుగా ఇవ్వడంతో పాటు కాలేజీ వెబ్ సైట్​లో పెట్టాలని ఆదేశించింది. 

అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 29లోగా పూర్తి చేయాలని కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ మేనేజ్ మెంట్లను ఆదేశించారు. స్టూడెంట్లు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం ఆరు వర్కింగ్ డేస్​అవకాశం ఇవ్వాలని సూచించారు. కాగా, ఇంజినీరింగ్ కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తుండగా, 30శాతం మేనేజ్ మెంట్ కోటాలో నింపుతారు. నిబంధనల ప్రకారమే మేనేజ్ మెంట్ కోటా సీట్లను కాలేజీలు నింపాలని, లేకపోతే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.