కాంచీపురంలో బస్సులో నుంచి జారిపడిన విద్యార్థి 

కాంచీపురంలో బస్సులో నుంచి జారిపడిన విద్యార్థి 

విద్యార్థులు మోయలేని విధంగా స్కూల్ బ్యాగులు,  ఇక పుట్ బోర్డుపై బస్సులో ప్రయాణం అంటే పెద్ద సాహసమే చేయాలి. ఒక్కసారి పట్టుకోల్పోయామా ఇక అంతే సంగతులు. ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో మిరాకిల్ జరిగింది.  ఓ  విద్యార్థి పుట్ బోర్డుపై నిలబడి బస్సులో జర్నీ చేస్తూ పట్టుకోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి కింద పడిన సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి విద్యార్థులు పెద్దగా కేకలు వేసినా డ్రైవర్ బస్సును ఆపలేదు. సదరు విద్యార్థి బస్సు వెనుక చక్రాలకు కొన్ని అంగుళాల దూరంలో కిందపడిపోయాడు. 

స్కూల్ కు ఆలస్యంగా వెళితే టీచర్లు కొడతారనే భయంతోనే ఫుల్ రష్ గా ఉన్న బస్సులో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై బస్సు ఓ వైపునకు వంగిపోయిందని తెలిపారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారింది.