
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. లక్ష్మీగూడా వాంబే కాలనీ సమీపంలో నాదర్గుల్ కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు లో మంటలు చెలరేగాయి. రన్నింగ్ లో ఉండగా బస్సు ఇంజిన్ భాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ హరి ప్రసాద్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కకు నిలిపాడు. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ALSO READ : ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు..
సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రయాన్ గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.