జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా బుగ్గారంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో స్కూల్ బస్సు డ్రైవర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ధర్మపురి జడ్జి యేగి జానకి తీర్పు చెప్పారు. వెల్గటూర్‌కు చెందిన ఆవుల సంపత్ (51) ప్రధానోపాధ్యాయుడు పనిచేసేవారు.
2017 ఆగస్టు 29న బైక్‌పై వెళ్తుండగా లచ్చయ్య నడిపిన స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో అతను చనిపోగా.. కేసు విచారణ అనంతరం అతనికి జైలు శిక్ష పడింది.
