నీళ్ల కాలువలోకి పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు.. పిల్లల అరుపులతో దద్దరిల్లిన ప్రాంతం

నీళ్ల కాలువలోకి పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు.. పిల్లల అరుపులతో దద్దరిల్లిన ప్రాంతం

కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కోడూరు మండలం విశ్వనాథపల్లి సమీపంలోని కాల్వలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. పిల్లల అరుపులతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏం అయి ఉంటుందని ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

పంట కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో విద్యార్థులు పెను ముప్పు నుంచి బయటపడ్డారు. స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా బయటకు తీశారు. బస్సు ప్రయాణిస్తున్న రోడ్డు బాగాలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిందని స్థానికులు చెబుతున్నారు. 

ప్రమాదానికి గురైన బస్సు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కుమారుడు వికాస్ యాజమాన్యంలో నడుపుతున్న ఎన్ఆర్ఐ వికాస్ కు చెందిన పాఠశాలగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.