వరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు. .30 మంది విద్యార్థులు సేఫ్

వరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు. .30 మంది విద్యార్థులు సేఫ్

మహబూబ్ నగర్ జిల్లా: రూరల్ మండలం సుగుర్ గడ్డ తండా మన్యకొండ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జ్ మధ్యలో స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. సగం వరకు స్కూల్ బస్ నీట మునిగింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు బస్సు నుంచి పిల్లలను బయటకు తీసి కాపాడారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లోకి భారీగా వర్షం నీరు చేరింది. రాంచంద్రపూర్, మాచన్ పల్లి, సుగుర్గడ్డ తాండా నుండి దాదాపు 30 మంది విద్యార్థులను మహబూబ్ నగర్ తీసుకెళ్తుండగా బస్సు నీటిలో చిక్కుకుపోయింది. బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని స్థానికులు అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు.