నాన్ టీచింగ్ సిబ్బంది రేషనలైజేషన్..చర్యలు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు

నాన్ టీచింగ్ సిబ్బంది రేషనలైజేషన్..చర్యలు ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు. కేవలం కొన్ని బడుల్లోనే ఉన్న రెగ్యులర్ సిబ్బంది.. ఎక్కువ మంది ఒకే చోట పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులపై భారం తగ్గించేందుకు సిబ్బందిని  రేషనలైజేషన్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ చర్యలు ప్రారంభించారు. దీని కోసం త్వరలోనే జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయనున్నారు. 

ఎక్కువగా ఉన్న స్కూళ్లకు సిబ్బందిని పంపించాలని కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బంది కేవలం 2,686 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సీనియర్ అసిస్టెంట్లు 47 మంది, జూనియర్ అసిస్టెంట్లు 439 మంది,  రికార్డు  అసిస్టెంట్లు 655 మంది, అకౌంటెంట్లు 13 మంది, అటెండర్లు 1,532 మంది ఉన్నారు. ఈ నెలాఖరులో రేషనలైజేషన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.