జనవరి నెలలో స్కూల్ పిల్లల సెలవులు ఇవే

జనవరి నెలలో స్కూల్ పిల్లల సెలవులు ఇవే

న్యూ ఇయర్ వచ్చేసింది. 2024లోకి అడుగు పెట్టేశాం. అయితే కొత్త సంవత్సరం వచ్చిదంటే చాలు సెలవులు ఎప్పుడా అని ఎదురుచూస్తారు చిన్నపిల్లలు.  జనవరిలో రిపబ్లిక్ డేతో పాటు సంక్రాంతి పండుగ సెలవులు కూడా వస్తాయి. దీంతో జనవరిలో స్కూల్ పిల్లలకు ఎక్కువ హాలిడేస్ వస్తాయి. 

జనవరి నెలలో స్కూల్ హాలిడేస్

జనవరి 1 న న్యూ ఇయర్  వరల్డ్ హాలిడే. జనవరి 13న రెండో శనివారం కొన్ని స్కూల్స్ కు హాలిడే ఇస్తాయి.  తెలుగు రాష్ట్రాల్లో జనవరి14 న భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. సాధారణంగా హాలిడే ఇస్తారు. జనవరి 15న సంక్రాంతి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇస్తారు. ఈ రోజుతో పాటు జనవరి 16, 17 కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.  జనవరి 17 న  గురు గోవింద్ సింగ్ జయంతి. సిక్కు తం పదవ, చివిర గురువు గురు గోవింద్ సింగ్ జన్మదినాన్ని  స్మరించుకునే మతపరమైన సెలవు.  జనవరి 25 న హజరత్ అలీ పుట్టిన రోజు. ఇది ప్రవక్త ముమహ్మద్ బంధువు, అల్లుడు, ఇస్తాం నాల్గవ ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్ జన్మదినాన్ని జరుపుకునే మతపరమైన హాలిడే. జనవరి 26. రిపబ్లిక్ డే  కాబట్టి దేశ వ్యాప్తంగా హాలిడేగా జరుపుకుంటారు. 

అయితే స్కూల్ హాలిడేస్ ఆయా ప్రాంతాలను బట్టి మారొచ్చు. ఈ సెలవులపై స్కూల్స్  అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంటుంది.