చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌డేకు స్కూల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌

చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌డేకు స్కూల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌

పులివెందుల మహేష్ హీరోగా నటిస్తూ  డైరెక్ట్ చేసిన చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రి, షన్ను  హీరోయిన్స్. సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు.  గంగాభవాని నిర్మించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా  సుమన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది.  

ప్పటికే ఎన్నో వందల సినిమాల్లో  నటించినప్పటికీ ఇందులోని  పాత్ర  నా మనసుకు దగ్గరగా అనిపించింది.  ఒక రైతు పాత్రలో రైతులకు అండగా నిలబడేలా కనిపిస్తా. ప్రతి ఒక్కరి జీవితంలో  స్కూల్ లైఫ్  ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.  

పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ఈ  సినిమాలో కథే హీరో.   క్రౌడ్  ఫండింగ్ చేసి సినిమాను పూర్తి చేశాం.   ఇందులో  కీలకపాత్రలు పోషించి మాకు  సపోర్ట్ చేసిన సుమన్ గారికి, ఆమని గారికి స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పారు. నటీనటులు, టెక్నీషియన్స్ అంతా పాల్గొన్నారు.