ఫీజు కట్టలేదని..  స్టూడెంట్స్ ను  బంధించిన్రు

ఫీజు కట్టలేదని..  స్టూడెంట్స్ ను  బంధించిన్రు

లక్నో: ఫీజు కట్టకపోతే స్టూడెంట్స్ ను క్లాసులకు రానివ్వని, పరీక్షలు రాయనివ్వని బడులను చూశాం. కానీ యూపీలో ఓ స్కూల్ యాజమాన్యం మాత్రం ఫీజు కట్టని స్టూడెంట్లను ఏకంగా ఓ గదిలో బంధించింది. పేరెంట్స్ రిక్వెస్ట్​ చేసినా వినకపోవడంతో పోలీసులు వచ్చి పిల్లలను విడిపించాల్సి వచ్చింది. బరేలీలోని ది హార్ట్​మన్​ స్కూల్​లో శనివారం జరిగిందీ ఘటన. ఉదయం స్కూల్​కు వచ్చిన స్టూడెంట్లలో ఫీజు కట్టని 35 మందిని ప్రిన్సిపాల్​ క్లాసు నుంచి తీస్కెళ్లి, తన రూమ్​లో నిలబెట్టిండు. తమ పిల్లలను తీస్కెళ్లడానికి వచ్చిన పేరెంట్స్ కు విషయం తెలిసి ఆందోళన చెందారు. పిల్లలను వదిలేయాలని రిక్వెస్ట్​ చేసినా మేనేజ్​మెంట్​ పట్టించుకోలేదు. పేరెంట్స్ సమాచారమివ్వడంతో పోలీసులు స్కూలుకు వెళ్లి పిల్లలను విడిపించారు. ఆ సమయంలో చిన్నారులు భయంతో వణికిపోతూ, కొంత మంది ఏడుస్తూ కనిపించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అసోసియేషన్​ మీటింగ్​లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.