
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండలలోని గొత్తికోయల గ్రామ పరిధిలోని రజబలి నగర్ లో స్కూల్‌ను ఎంఈవో ఆనంద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. రజబలినగర్ స్కూల్ ఉన్న గ్రామాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాగులు ప్రవహిస్తుండడంతో పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఆ గ్రామాన్ని ఎంఈవో సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమస్యలను జిల్లా విద్యాశాఖ ఆఫీసర్ల కు తెలియచేయగా, వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
దీంతో ఎంఈవో రజబలినగర్ లో స్కూల్ ఏర్పాటు చేసి రోజుకో టీచర్‌ను పంపి పాఠాలు చేప్పేలా ప్రణాళిక చేసినట్లు ఎంఈవో తెలిపారు. కార్యక్రమంలో సీసీవో వెంకటరమణ, సీఆర్పీ శిరీష, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.