
మీర్ పేట్ : స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం మీర్ పేట్ లో జరిగింది. బాలకృష్ణ(25) అనే వ్యక్తి ఇద్దరు పిల్లలు శ్రేయాస్(10), లోక్చిత(13) ను బైక్ పై ఎక్కించుకుని వెళ్తుండగా..సడెన్ గా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టింది.
దీంతో బైకుపై ఉన్న బాలకృష్ణ, శ్రేయాస్ అక్కడికక్కడే చనిపోగా..పాప లోక్చితకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు. గాయపడ్డ పాపను హస్పిటల్ లో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు.