చదువు చెప్పని టీచర్​ మాకొద్దు.. స్కూల్ కు తాళం వేసిన గ్రామస్తులు

చదువు చెప్పని టీచర్​ మాకొద్దు.. స్కూల్ కు తాళం వేసిన గ్రామస్తులు

గద్వాల, వెలుగు:  ‘‘స్కూల్ కు రెగ్యులర్​గా  రారు..  ఎప్పుడో ఒకరోజు వచ్చినా పాఠాలు అసలే చెప్పరు..”అని  జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధి శేషంపల్లి గ్రామంలో శుక్రవారం స్కూల్​కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు, సర్పంచ్ మాట్లాడుతూ..  గ్రామంలోని  సీపీఎస్  టీచర్  పాఠశాలకు సక్రమంగా రాకపోవడంతో తమ పిల్లల చదువులు దెబ్బతింటున్నాయన్నారు.

ప్రైవేట్ స్కూళ్లకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.  రెండేండ్ల నుంచి టీచర్ ను మార్చాలని కోరినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో స్కూల్ కు తాళం వేశామన్నారు. ఈ విషయమై ఎంఈవో కొండారెడ్డి వివరణ కోరగా  డిప్యూటేషన్ పై వేస్తే ఆమె వెళ్లరని,  బదిలీ చేద్దామంటే రూల్స్ ఒప్పుకోవని,  తాము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. దీనిపై సాయంత్రం సర్పంచ్ ఫోన్ చేసి చెప్పారని, శనివారం వెళ్లి విచారణ చేస్తామన్నారు.