తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొద్ది కొనసాగనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీలంకలోని బట్టికలోవాకు 60కిలో మీటర్ల దూరంలో తమిళనాడులోని కరైకల్ కు 400 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్రమై తీరం దాటే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.