హోలీ ఫెస్టివల్: సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హోలీ ఫెస్టివల్: సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఇండియాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే పండగ హోలీ. మార్చి 25న హోలీ పండగ సందర్భంగా ఇప్పటికే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు జనాలు. రకరకాల రంగులతో ఎంతో ఉత్సాహంగా కలర్ ఫుల్ గా హోలీ జరుపుకునేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

ఇక, గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. గుడ్ ఫ్రైడే ఈ నెల 29న వస్తోంది. ఈ రోజును సాధారణ సెలవుదినంగాప్రకటించింది.  అలాగే.. హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలు మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా కూడా ప్రకటించే అవకాశం ఉంది.