
మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లను మూసివేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడిచే స్కూళ్లను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్కూళ్లను తెరవడం లేదన్నారు. సోమవారం నుంచి ముంబైలో స్కూళ్లను తిరిగి ఓపెన్ చేయాల్సి ఉందని.. అయితే బీఎంసీ పరిధిలో ఉండే స్కూళ్లకు మాత్రం ఆంక్షలను పెంచేశారు. లేటెస్టుగా ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముంబై మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు నవంబర్ 23వ తేదీన స్కూళ్లను తెరవడం లేదని మేయర్ శుక్రవారం తెలిపారు.