రాష్ట్రంలో ఆగస్ట్ 3నుంచి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఆలోపు నాడు – నేడు అభివృద్ధి పథకం కింద జులై నెలాఖరులోగా మొదటి విడతలో 15,715 స్కూళ్లలో మరమత్తు చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రోజు సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్కూల్స్ మరమత్తుల కోసం రూ.456 కోట్ల నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. వీటికి కావాల్సిన సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని అధికారులు జాగ్రత్తగా పనులు చేయాలని సూచించారు.
