స్కూళ్ల రిపేర్లకు పైసల్లేవ్‌ !

స్కూళ్ల రిపేర్లకు పైసల్లేవ్‌ !

కేంద్రం నిధులు ఆపేసింది. రాష్ట్రం చూసీచూ డనట్టు ఉంటోంది. రెండింటి మధ్య స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నిధుల లేమితో విలవిల్లాడుతోం ది. నిన్నామొన్నటి దాక డిస్ట్రి క్ట్‌‌ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ (డీపీఈపీ), సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ ఎస్‌ ఏ)ల కిం ద అంతోఇంతో ఇచ్చిన కేంద్రం ఈ సారి మొండి చేయి చూపింది. ప్లానింగ్‌ అప్రూవల్‌ బోర్డు (పీఏబీ)లో రాష్ట్రానికి ఒక్క పైసా కేటాయిం చలేదు. రాష్ట్రం కూడా రెండేళ్లుగా స్కూల్‌ బిల్డింగ్‌ , టాయ్‌ లెట్స్‌ రిపేర్లకు నామమాత్రపు నిధులే ఇస్తోంది. ఇవి చిన్నచిన్న రిపేర్లు, కొత్త నిర్మాణాలకు సరిపోవడం లేదు. దీంతో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్‌ , పనిచేయని టాయ్‌ లెట్స్‌ దర్శనమిస్తు న్నాయి. అప్పట్లో ఫుల్లు డబ్బులు
స్టేట్‌ లో మొత్తం 25,921 స్కూళ్లున్నాయి. వాటిలో 21,285 ప్రైమరీ, 4,636 హైస్కూళ్లు. వీటిలోనూ లోకల్‌ బాడీ (మండల, జిల్లా
పరిషత్‌ ) స్కూళ్లు 24,293 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లు 1,628 ఉన్నాయి. అయితే 1996-–97కు ముం దు మండల, జిల్లా
పరిషత్‌ స్కూళ్లలో రిపేర్లకు , ఇతర మెయిం టెనెన్స్‌ పంచాయతీరాజ్‌ శాఖ, స్టేట్‌ గవర్నమెంట్‌ స్కూల్స్‌ ను ఆర్‌ అండ్‌ బీ ఇంజినీరిం గ్‌ శాఖలు చూసుకునేవి.

అదే సమయంలో డిస్ట్రిక్ట్‌‌ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ (డీపీఈపీ), సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ ఎస్‌ ఏ) పేర్లతో
కేంద్రం కొత్త ప్రాజెక్టులు తెచ్చింది. స్కూల్‌బిల్డింగ్ స్‌, టాయ్‌ లెట్స్‌ నిర్మాణం, వాటి రిపేర్లకు భారీగా డబ్బులిచ్చింది. దీంతో వాటి నిర్వహణకు విద్యాశాఖాధికారులు ప్రత్యేకంగా ఇంజినీరిం గ్‌ శాఖ ఏర్పాటు చేసుకుని పనులు చేయించారు. దీంతో క్రమంగా పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ శాఖలకు, ఈ స్కూళ్లకు సంబంధం లేకుం డా పోయిం ది. పాత పద్ధతే బెటరంటున్న విద్యాశాఖ
స్కూల్‌ ఎడ్యుకేష న్‌ డిపార్ట్‌‌మెం ట్‌ , ఎస్‌ ఎస్‌ ఏలో నిధుల్లేక రిపేర్లన్నీ పెండింగ్‌ లో ఉన్నాయి. దీనికితోడు కాం ట్రాక్టు పద్ధతిలో కొనసాగుతు న్న ఇంజినీర్లకూ శాలరీలు చెల్లించే పరిస్థితి లేదు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా కు చెందిన ఇంజినీర్లకు ఏడు నెలల శాలరీ పెండింగ్‌ లో ఉందని, ఎస్‌ ఎస్‌ ఏ ప్రాజెక్ట్‌‌ డైరెక్టర్‌ విజయ్ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ ఇబ్బందుల నేపథ్యం లో 1996కు ముం దున్న పద్ధతే బెటరని స్కూల్‌ ఎడ్యుకేష న్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లలో రిపేర్లు ఇతర మెయిం టెనెన్స్‌ పంచాయతీరాజ్‌ శాఖకు, స్టేట్‌ గవర్నమెంట్‌ స్కూల్ స్‌ రోడ్డు భవనాల శాఖ ఇంజినీరిగ్‌ శాఖకు అప్పగిం చాలని ఆ శాఖ కమిషనర్‌ విజయ్‌ కు మార్‌ ప్రభుత్వానికి ఇటీవలే లేఖ రాశారు.