మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న సైన్స్ సమ్మర్ క్యాంప్‌ను సోమవారం డీఈవో యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవిలో విజ్ఞానం, వినోదం అందించడానికి సైన్స్ ప్రయోగాలతో ఏర్పాటుచేసిన క్యాంప్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులను మొబైల్స్‌కు దూరంగా ఉంచడానికి, ప్రయోగాలు చేస్తూ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి శిబిరం ఎంతో తోడ్పడుతుందన్నారు. జిల్లా సైన్స్ కేంద్రం, జిజ్ఞాస మొబైల్ లాబరేటరీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపు మే 8 వరకు కొనసాగుతుందని తెలిపారు. సైన్స్ క్యాంపులో 80 శాతం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు, 20 శాతం ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు భరత్ కుమార్, జంబోజు సత్తయ్య, విజయలక్ష్మి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.

