కరోనా వైరస్ ను అరికట్టేందుకు సైంటిస్ట్ లు పరిశోధనలు చేస్తున్నారు. ఓ వైపు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తూనే మరో వైపు టెస్ట్ ల్ని మరింత సులభంతరం చేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
తాజాగా కరోనా టెస్ట్ ను సులభతరం చేసే కిట్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ తన జర్నల్ లో పొందు పరిచింది. సాధారణంగా కరోనా టెస్ట్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని పరీక్షల్లో కరెక్ట్ రిజల్ట్ రావడం లేదని కరోనా నెగిటీవ్ ఉన్నా పాజిటీవ్ వచ్చిన ఘటనల్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ N1-STOP-LAMP అని పిలిచే కిట్ తో కేవలం 20 నిమిషాల్లో కరోనా టెస్ట్ చేసుకోవచ్చని జర్నల్ లో పేర్కొంది.
సైంటిస్ట్ లు ఈ కొత్త కిట్ ను ముక్కు ద్వారా టెస్ట్ చేసేలా డిజైన్ చేశారు. త్వరలో ఈ కిట్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పరిమిత పరీక్ష సామర్థ్యాలతో కిట్ ను మరింత డెవలప్ చేసేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
