హిమాలయాల్లో సముద్రం ఉండేది.. కనిపెట్టిన సైంటిస్టులు

హిమాలయాల్లో సముద్రం ఉండేది.. కనిపెట్టిన సైంటిస్టులు

మనం సముద్రాల ఉనికి గురించి రకరకాలుగా ఉన్నాం. సముద్రాలు ఎలా ఏర్పాడ్డాయి..? ఎందుకు ఏర్పడుతాయనే విషయాల గురించి కూడా చాలామంది చదివే ఉంటారు. ఇప్పుడు సముద్రం గురించి మరో ఆసక్తికరమైన న్యూస్ బయటపడింది. 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), జపాన్‌లోని నీగాటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హిమాలయాలలో దాదాపు 600 మిలియన్ సంవత్సరాల క్రితం  సముద్రం ఉండేదాన్ని గుర్తించారు. ఆ సముద్రంలో నుంచి మిగిలిపోయిన ఖనిజ నిక్షేపాలలో చిక్కుకున్న నీటి బిందువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి చరిత్రకు సంబంధించిన ఆక్సిజనేషన్‌ ఏర్పడుటకు దారితీసిన సంఘటనలను గురించి తమ అ‍ధ్యయనంలో వెల్లడించారు సైంటిస్టులు. 

హిమలయాల్లో సముద్ర ఫలకాలకు సంబంధించిన నీటి బిందువుని గుర్తించడంతో సైంటిస్టులకు మరిన్ని ఆసక్తకిరమైన విషయాలు తెలిశాయి. శాస్త్రవేత్తల బృందం కనుగొన్న నీటి బిందువు స్నోబాల్ ఎర్త్ గ్లేసియేషన్ సమయానికి చెందినదని, కాల్షియంను కోల్పోయినట్లు గుర్తించారు. మహాసముద్రాల్లో ప్రవహం లేదు గనుక కాల్షియం అవక్షేపం ఉండదని, దానిలో నెమ్మదిగా మెగ్నిషియం పెరుగుతుందని చెప్పారు. 

వాతావరణంలో ఆక్సిజన్‌ పెరిగినప్పుడల్లా జీవసంబంధమైన రేడియేషన్‌ ఉంటుంది అని శాస్త్రవేత్త ఆర్య చెప్పారు. దీనికోసం శాస్త్రవేత్లల బృందం పశ్చిమ కుమావోన్‌ హిమాలయాలలో అమృత్‌పుర్‌ నుంచి మిలామ్‌ హిమనీనాదం వరకు, అలాగే డెహ్రుడూన్‌ నుంచి గంగోత్రి వరకు అదృశ్యమైన సముద్రల ఉనికి కోసం అన్వేషించారు. ఈ నిక్షేపాలు పురాతన సముద్రపునీటి ఉనికిని వెల్లడించాయి. ఇది భూమి చరిత్రకు సంబంధించి మహా సముద్రాల ఉనికి వాటి పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.