ఓవర్ స్పీడ్ తో చెట్టును ఢీకొట్టిన స్కూటీ ..ఇద్దరు నేపాల్ యువకులు మృతి

ఓవర్ స్పీడ్  తో చెట్టును ఢీకొట్టిన స్కూటీ ..ఇద్దరు నేపాల్ యువకులు మృతి

ఘట్​కేసర్, వెలుగు: స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు నేపాల్ యువకులు మృతి చెందారు. నేపాల్​కు చెందిన కమల్ టమాటా (20), దామర్ టమాటా (18) ఘట్​కేసర్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివసిస్తూ ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బోగారంలోని బంధువుల ఇంటికి హోండా యాక్టివాపై బయలుదేరారు. 

కొండాపూర్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పాట్​లోనే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలస్వామి తెలిపారు. 

ఇబ్రహీంపట్నంలో మరొకరు

ఇబ్రహీంపట్నం: అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొనడంతో ఇబ్రహీంపట్నంలో మరొకరు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్‌‌గూడకు చెందిన బొమ్మ రాజు (35) సోమవారం సాయంత్రం సాగర్ రహదారిపై బైక్​పై బెంగళూరు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓవర్​స్పీడ్​తో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.