UAE vs SCOT: 94 పరుగులకే ఆలౌట్.. అయినా భారీ విజయం

UAE vs SCOT: 94 పరుగులకే ఆలౌట్.. అయినా భారీ విజయం

టీ20 క్రికెట్ లో 100 పరుగులైనా చేయకపోతే ఆ జట్టు గెలుపు మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఒకవేళ గెలిచినా ఆ మ్యాచ్ థ్రిల్లర్ అవుతుంది. అయితే యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. స్వల్ప స్కోర్ కే పరిమితమైనా.. సమిష్టిగా రాణించడంతో అద్భుత విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైనా బౌలర్లు మ్యాచ్ ను నిలబెట్టారు.
 
దుబాయి వేదికగా నిన్న యూఏఈ, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని ఫలితం వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో కేవలం 94 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మున్సీ 21 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలిన ఏ ఒక్క బ్యాటర్ కనీస స్కోర్ కూడా చేయలేకపోయాడు. స్పిన్నర్ అయాన్ ఖాన్ నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ బౌలర్లు అంచనాలకు మించి రాణించారు. మొదటి 8 ఓవర్లలోనే 19 పరుగులకే 7 వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. పేస్ బౌలర్లు కరీస్,జర్వీస్ ధాటికి టాప్ 5 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టాపార్డర్ అయితే డకౌట్ గా వెనుదిరిగారు. లోయర్ ఆర్డర్ ను మార్క్ వాట్ త్వరగా పెవిలియన్ కు చేర్చడంతో యూఏఈ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. దీంతో 94 పరుగులు చేసిన స్కాట్లాండ్ 32 పరుగుల విజయాన్ని గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది.