- ఉద్యోగులకు ఎస్సీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, ప్రయాణికులు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములు కావాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ (జీఎం) అరుణ్ కుమార్ జైన్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్వభావ్ స్వచ్ఛ- సంస్కార్ స్వచ్ఛత’ అనే థీమ్‌తో ఎస్సీఆర్ ‘స్వచ్ఛతా హి సేవా’ పరిశుభ్రత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్వే క్రీడా ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడారు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైల్వే కార్యాలయాల వద్ద పరిశుభ్రత మెరుగుపరిచేందుకు15 రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ‘స్వచ్ఛతా హి సేవా’ ప్రచారంలో భాగంగా స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు.
