క్యూ ఆర్ కోడ్ తో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు

క్యూ ఆర్ కోడ్ తో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు

క్యూఆర్ (క్వి క్రెస్పాన్స్) కోడ్ ద్వారా రైలు టికెట్లనుబుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అన్ రిజర్వ్​డ్ టికెటింగ్ సిస్టం  (యూటీఎస్) యాప్ ద్వారాటికెట్ల బుకింగ్ అమల్లో ఉంది.తాజాగా క్యూఆర్ కోడ్ ద్వారా జనరల్ టికెట్లను బుకింగ్ చేసుకునే పద్ధతిని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టింది. డిస్ ప్లే కోసం క్యూఆర్ కోడ్ లను అన్ని స్టేషన్లకు పంపినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. స్టేషన్ కు కిలో మీటర్లోపు నుంచి క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో టికెట్లు కొనుగోలు చేసేందుకు వీలవుతుందని చెప్పారు. దీని వల్ల క్యూలో నిలబడే విలువైన సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓప్రకటన విడుదల చేశారు.