
స్క్రిప్ట్ బాక్స్ ఆధ్వర్యంలో వీ6 చిల్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్ సహకారంతో 3 రోజుల సెషన్
ప్రముఖ ఫిల్మ్ మేకర్ సత్యాంషుసింగ్ తో క్లాసెస్
నేటితో ముగియనున్న వర్క్ షాప్
ఎంతో మందికి కథలు రాయాలని ఉంటుంది. మంచి మంచి స్టోరీ ఐడియాస్ వస్తుంటాయి. కానీ కథ రూపంలోకి మార్చడంలో వెనకడుగు వేస్తుంటారు. స్క్రీన్ రైటర్ అవ్వాలనుకునేవారికి స్టోరీస్ ఎలా రాయాలో తెలియాలి. అందుకు ప్రాపర్ ట్రైనింగ్ అవసరం. ఔత్సాహిక రైటర్స్‌కు స్క్రీన్ రైటింగ్ లో మెళకువలు నేర్పించేందుకు స్క్రిప్ట్ బాక్స్ సంస్థ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. వీ6 చిల్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ప్రొడక్షన్స్ స్పానర్స్ గా వ్యవహరిస్తున్నాయి.
సినిమా.. మూడు గంటల ఎంటర్టైన్మెంట్. ఒక మూవీ ఆడియన్స్ముందుకు రావాలంటే దాని వెనుక వేల మంది కష్టం ఉంటుంది. స్క్రీన్ పై బొమ్మ అద్భుతంగా ఉండాలంటే స్క్రీన్ రైటర్ పనితనం మీదే ఆధారపడి ఉంటుంది. అనుకున్న కథకు సినిమా రూపం ఇవ్వాలంటే.. ఆ కథను ఎలా రాయాలి? డైలాగ్స్ ఏ విధంగా ఉండాలి? క్యారెక్టర్ లెంగ్త్ ఎంత? అనే విషయాలు స్క్రీన్ రైటర్ కి తెలియాల్సిన ప్రాథమిక అంశాలు. ఇలాంటి విషయాలన్నీ చెప్పి ఔత్సాహిక స్క్రీన్ రైటర్స్ ను వెలుగులోకి తెచ్చేందుకు స్క్రిప్ట్ బాక్స్ సంస్థ జనవరి 31న ‘ది బ్లాంక్ పేజ్’ పేరుతో వర్క్ షాప్ స్టార్ట్‌చేసింది. ప్రముఖ స్క్రీన్ రైటర్ సత్యాంషు సింగ్ తో ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో క్లాసెస్ కండెక్ట్ చేస్తోంది. ఈ వర్క్ షాప్ కి వీ6 చిల్, సురేష్ ప్రొడక్షన్స్, గురు ప్రొడక్షన్స్ స్పానర్స్ గా వ్యవహరిస్తున్నాయి. నేటితో ఈ వర్క్ షాప్ ముగియనుంది.
క్వాలిటీ రైటర్స్ కోసమే..
‘‘వీ6 చిల్ చానెల్‌కి స్క్రిప్ట్ రూమ్ క్రియేట్ చేద్దామని వెళ్లాం. మంచి రైటర్ కోసం వెతికాం. మాకు దొరకలేదు. అప్పుడే మాకు అనిపించింది వర్క్ షాప్ ఒకటి క్రియేట్ చేయాలని. అలా చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న రైటర్స్, కొత్త రైటర్స్ బయటికి వస్తారు. వారికి ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాం. ఇలా ‘ది బ్లాంక్ పేజ్’ పేరుతో వర్క్ షాప్ కండెక్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేద్దామనుకున్నాక సురేష్ ప్రొడక్షన్, గురు ప్రొడక్షన్, వీ6 చానెల్ మాకు స్పానర్స్ గా నిలిచాయి.” అని స్క్రిప్ట్ బాక్స్ కంపెనీ నిర్వాహకుల్లో ఒకరైన మహేష్ కుమార్ యెల్లపు చెప్పారు.
2, 3 నెలలకు ఒకసారి
రైటింగ్ చాలా డిఫికల్ట్. ఇంట్లో కూర్చుని సినిమా చూస్తూ అంతా నేర్చేసుకుందాం అనుకుంటే కుదరదు. సినిమా ఇండస్ట్రీకి రైటర్స్ అవసరం ఎంతో ఉంది. అవకాశాలూ ఉన్నాయి. కానీ కావాల్సిన క్వాలిటీ స్క్రీన్ రైటర్స్ దొరకడం లేదు. హాలీవుడ్, బాలీవుడ్ లోని స్క్రిప్ట్రైటర్స్ మన కన్నా 20, 30 సంవత్సరాలు ముందుగా ఆలోచించి స్టోరీస్ రాస్తున్నారు. కథను రాసి చెప్పగలిగే ఉత్సాహం రైటర్స్ లో ఉండాలి. అందుకే ముందుగా తెలిసిన స్క్రీన్ రైటర్స్ తో ది బ్లాంక్ పేజ్ వర్క్ షాప్ కండెక్ట్ చేద్దామని అనుకున్నారు. వీ6 చానెల్, సోషల్ మీడియా, ఇన్ స్టాగ్రామ్, తెలిసిన రైటింగ్ గ్రూప్స్ ద్వారా స్క్రిప్ట్ బాక్స్ నిర్వాహకులు వర్క్ షాప్ ని ప్రమోట్ చేశారు. ఒకే కథను సినిమాలా, వెబ్ సిరీస్ లా రాయగలిగే కల్చర్ ఇంకా లేదు. ఆ డెవలప్మెంట్ కోసం ప్రతి 2, 3 నెలలకి వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు. రైటర్స్ గ్రూప్స్ ఫామ్ చేస్తూ, వారికి ఎకో సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయనున్నారు. భిన్న ఆలోచనలు ఉన్న వారిని ఒకచోట చేర్చి కథ ఎలా, రాయాలో ప్రాక్టికల్ గా చెప్తున్నారు. వర్క్ షాప్ కి చాలామంది అప్రోచ్ అయితే అందులో నుంచి కొంత మందిని ఫిల్టర్ చేసి 3 రోజుల ఇంటిన్సిటివ్ సెషన్ నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్లో 2 నెలలకు ఒకసారి వర్క్ షాప్స్ చేయబోతున్నారు.
నేర్చుకుంటేనే ఏదైనా సాధ్యం
మూడు రోజుల వర్క్ షాప్ కోసం ఇక్కడికి వచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. మెడిసిన్ చదివాకే డాక్టర్స్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పాటలు పాడాలంటే ముందుగా మంచి సంగీత విద్వాంసుడి వద్ద ట్రైనింగ్ తీసుకుంటారు. అలాగే స్క్రీన్ రైటింగ్ కూడా. మన కంట్రీలో చాలా తక్కువ ఫిల్మ్ స్కూల్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఇది చాలా గ్రోయింగ్ లో ఉంది. అందుకే వర్క్ షాప్ కండెక్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ కథలు రాసేవిధంగా ప్రభావితం చేసే అంశాలను తెలుసుకుంటుంన్నాం. నేను12 ఏళ్ల క్రితం స్క్రీన్ రైటింగ్ మొదలుపెట్టాను. ఇక్కడికి స్క్రీన్ రైటింగ్ అంటే తెలియని వాళ్లు, తెలిసిన వాళ్లు, ఫిల్మ్ మేకర్స్ గా వర్క్ చేస్తున్న వాళ్లు వచ్చారు. ఫండమెంటల్, సింపుల్ కాన్సెప్ట్స్ తో మొదటిరోజు సెషన్ జరిగింది. రెండో రోజు ఏదైనా అనుకుంటే దాన్ని అచీవ్ చేయాలి, గ్రేడియేషన్, టెక్నికల్ టాపిక్ పై జరిగింది. మూడో రోజు టెక్నికల్ టాపిక్స్ పై సెషన్ జరగనుంది.
– సత్యాంషు సింగ్, ఫిల్మ్ మేకర్, ముంబై
యంగ్ రైటర్స్‌కు మంచి చాన్స్
యంగ్ రైటర్స్ కి ఉపయోగపడే వర్క్ షాప్ ఇది. ఇండస్ట్రీకి రైటర్స్ అవసరం ఉంది. బాగా రాయగలిగితే సినిమాలు, టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్ లు బాగుంటాయి. బాగా రాయకనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. – సురేష్ బాబు, ప్రొడ్యూసర్
ఎకో సిస్టం కోసం..
ఇలాంటి వర్క్ షాప్స్‌తో సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ రాసే టెక్నిక్ నేర్చుకుంటాం. రైటర్స్ లో ప్రాక్టికాలిటీ మిస్ అవుతుంది. ఆంబిషన్స్ తో వచ్చేవాళ్లు తగ్గిపోయారు. రైటింగ్ ఎకో సిస్టం క్రియేట్ చేయాలన్నదే మా విజన్.
– సునితా తాటి, గురు ఫిల్మ్స్
హెల్ప్ ఫుల్ గా ఉంది
నేను పేరెంట్స్ లో అవగాహన తీసుకొచ్చేలా మున్నిస్ డ్రీమ్ పార్ట్–-1 అనే సినిమా తీశాను. వర్క్ షాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలాంటివి ఇంకా జరగాలి.
– సీమా అగర్వాల్, పార్టిసిపెంట్, హైదరాబాద్
చాలా నేర్చుకున్నా
నేను ఫిల్మ్ మేకర్ ని. అస్టిసెంట్, అసోసియేట్ గా కొన్ని మూవీస్ కి చేశాను. చాలా వర్క్ షాప్స్ కి అటెండ్ అయ్యాను కానీ ఇది చాలా డిఫరెంట్. చాలా నేర్చుకున్నాను. మర్చిపోయిన ఫండమెంటల్స్ తిరిగి తెలుసుకున్నా.
– రజినీ కాంత్ కోట, ఫిల్మ్ మేకర్