Akhil Akkineni Wedding: గ్రాండ్గా అఖిల్ అక్కినేని-జైనాబ్ పెళ్లి.. బరాత్లో నాగచైతన్య హుషారు డ్యాన్స్

Akhil Akkineni Wedding: గ్రాండ్గా అఖిల్ అక్కినేని-జైనాబ్ పెళ్లి..  బరాత్లో నాగచైతన్య హుషారు డ్యాన్స్

అక్కినేని అఖిల్, తన ప్రియురాలు జైనాబ్ తో పెళ్లి ఘనంగా జరిగింది. నేడు శుక్రవారం (జూన్ 6న) తెల్లవారుజామున అఖిల్-జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఉదయం మూడు గంటలకు అఖిల్, జైనాబ్ వివాహం వైభవంగా జరిగింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల చీరకట్టులో మెరిశారు.

హీరో నాగార్జున ఆహ్వానం మేరకు సినీ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో సుమంత్  సహా తదితరులు హజరై సందడి చేశారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ కూడా పెళ్లికి వచ్చారు. కాగా అఖిల్ రిసెప్షన్ వేడుక ఆదివారం (జూన్ 8న) పెద్దఎత్తున జరగనుంది.

ఈ ఈవెంట్కి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార సహా పలు రంగాల ప్రముఖులు హాజరుకాన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నాగార్జున ఆహ్వానించిన సంగతి తెలిసిందే.