Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా.. ప్రెస్ నోట్తో నిర్మాత అధికారిక ప్రకటన

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా.. ప్రెస్ నోట్తో నిర్మాత అధికారిక ప్రకటన

సుదీర్ఘకాలం పాటు సెట్ పైనే ఉన్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఐదేళ్ల కిందట మొదలైంది. ఏపీ రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాతకు ఇబ్బంది కలిగించవద్దన్న ఉద్దేశంతో బిజీగా ఉన్నప్పటికీ ముందుగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు ఆయన ముందుకు రావడంతో షూటింగ్ కాస్త ముగిసి విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

ఇందులో భాగంగానే ప్రమోషన్స్, పాటలు, ఇంటర్వ్యూలు వంటివి చేస్తూ ముందుకెళ్లారు. జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడడటంతో ఫ్యాన్స్ ఫుల్ డిస్సప్పాయింట్ అవుతున్నారు.

►ALSO READ | Thug Life: ఇండియన్ 2ను అధిగమించని థగ్ లైఫ్.. కమల్ హాసన్ సినిమాకు తొలిరోజు వసూళ్లు ఎంతంటే?

లేటెస్ట్గా సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. శుక్రవారం నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. ‘పూర్తిస్థాయి నమ్మకంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన శ్రేయోభిలాషులు, అభిమానులు, సనీ ప్రేమికులందరికీ కృతజ్ఞతలు. ఇంతకుముందు ప్రకటించినట్లుగా జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేశాం.

అయినప్పటికీ చెప్పిన తేదీకి థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని చెప్పడానికి చింతిస్తున్నాం. చెప్పడానికి కష్టంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా నటించిన ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలన్నదే మా టీమ్ ప్రయత్నం.

ప్రతి ఫేమ్‌పై స్పెషల్ ఇంట్రస్ట్ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకోసం మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని ప్రామిస్ చేస్తున్నాం’ అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అయితే, సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతోనే, మరోసారి సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ వార్త వారం రోజులనుంచి వైరల్ అవుతున్నప్పటికీ.. మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఎటూతేల్చుకోలేక సందేహంలోనే ఉంటూ వస్తున్నారు.

ఇక లేటెస్ట్ అప్డేట్తో ఫ్యాన్స్కు ఓ క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే యూఎస్ఏ లోని మెయిన్ థియేటర్స్ నుండి వీరమల్లు సినిమాని తొలగించారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన షోలను పలు థియేటర్ల నుండి తొలగించడంతో వాయిదా పడిందనే క్లారిటీ వచ్చింది.

కొత్త తేదీ ఖరారుపై ప్రస్తుతం మూవీటీమ్ కసరత్తులు చేస్తోంది. ఇకపోతే జూలై 4న థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్. రిలీజ్ డేట్తో పాటుగా ట్రైలర్ అనౌన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే కథతో దీన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు.