మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం చెక్కిన శిల్పి అరెస్ట్

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం చెక్కిన శిల్పి అరెస్ట్

మహారాష్ట్రలో కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని చెక్కిన శిల్పిని అరెస్ట్ చేశారు పోలీసులు. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఆ విగ్రహ శిల్పి జయ్‌దీప్‌ ఆప్టే 10 రోజులుగా పరారీలో ఉన్నాడు. గురువారం జయ్‌దీప్‌ భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న జయ్‌దీప్‌ కోసం మహారాష్ట్ర పోలీసులుఏడు బృందాలుగా ఏర్పడి వెతుకున్నారు. అయితే కల్యాణ్‌లోని అతని ఇంటి బయట అదుపులోకి తీసుకున్నారు. కుటుంబాన్ని కలిసేందుకు వస్తున్నాడని ఆప్టే భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు.

ALSO READ | కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

2023లో నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పది నెలలు గడువక మేందే గత నెల కుప్పకూలిపోయింది. శివాజీ విగ్రహం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు తీసుకున్నప్పటికీ.. రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చే చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.  కల్యాణ్‌ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్‌ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశాడనే అనుమానాలు తలెత్తతున్నాయి. విగ్రహం కూలిన ఘటనలో ఆప్టేపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు.