ముంబై: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ముంబైలోని నటి రకుల్‌ప్రీత్ సింగ్ నివాసంలో సోమవారం (సెప్టెంబర్ 28) ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రకుల్‌తో పాటు ఆమె భర్త జాకీ భగ్నానీ, మామ వాషు భగ్నానీ ఇళ్లు, కార్యాయాలు, పనోరమా స్టూడియోస్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
నిధుల అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సినిమా ప్రాజెక్టులు, అంతర్జాతీయ చిత్రాల నిర్మాణం, ఓవర్సీస్ పంపిణీ, విదేశాలలో షూటింగ్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు పెద్ద ఎత్తున నిధులను తరలించినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. క్రాస్-బోర్డర్ బ్యాంక్ రికార్డులు, లెడ్జర్ ఎంట్రీలు, సినిమా నిర్మాణ ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సోదాలపై ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ALSO READ : నాగ్, ఎన్టీఆర్‌తో యాడ్స్.. హీరోగా ఎంట్రీతోనే కౌశిక్ చేతిలో 5 క్రేజీ ప్రాజెక్ట్స్!
ఇక కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన రకుల్‌ప్రీత్ సింగ్ క్రమంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది. బాలీవుడ్ పొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు. కేవలం బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే యాక్ట్ చేస్తోంది. రొమాంటిక్ కామెడీ చిత్రం 'పతి పత్ని ఔర్ వో దూ' చిత్రంలో ఈ బ్యూటీ చివరగా నటించింది. 2026, మే 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రకుల్ అప్‌కమింగ్ మూవీ రామాయణం. నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పౌరాణిక చిత్రం రామాయణం సినిమాలో రకుల్ శూర్పణఖ పాత్రలో కనిపించనుంది.
