
వర్షాకాలంలో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతాయ్. పైగా మబ్బులు పట్టి వాతావరణం డల్‌గా అనిపిస్తుంది. ఆ డల్‌నెస్ ముఖంలో కనిపించకుండా చినుకుల్లోనూ స్టైలిష్‌గా ఉండాలంటే ఇలా డ్రెస్‌లు సెలక్ట్ చేసుకోవాలి. వర్షాకాలంలో కాటన్ డ్రెస్‌లు బెస్ట్ ఆప్షన్. రేయాన్, చాంబ్రే , డెనిమ్, పాలిస్టర్, క్రేప్ ఫ్యాబ్రిక్‌తో తయారైన డ్రెస్‌లు బాగుంటాయి. అలాగే ఈ కాలంలో పాదాల వరకూ ఉండి నేలను తాకే గౌన్లు, సల్వార్స్, పటియాలా డ్రెస్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒంటికి అతుక్కుపోయే బట్టలు వేసుకోకుంటేనే బెటర్. ఈ కాలంలో డ్రెస్‌లు లూజ్‌గా ఉంటేనే బాగుంటుంది. వైట్ కలర్ డ్రెస్‌లకి దూరంగా ఉండాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లాంటి బ్రైట్ కలర్ కుర్తీలు, డ్రెస్‌లు ఈ కాలానికి బాగా నప్పుతాయి.